నరసరావుపేటలోనూ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై టిడిపి అనుయాయుల దాడి

May 13,2024 17:12 #dadi

పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని నరసరావుపేటలో సోమవారం సాయంత్రం టిడిపి అనుయాయులు హడావుడి సృష్టించారు. ఇక్కడి టిడిపి అభ్యర్థి డాక్టర్‌ అరవిందబాబు అనుయాయులు సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి గోపిరెడ్డి ఇంటిని ముట్టడించారు. ఇంటిపై రాళ్లు రువ్వారు. యువకులు రోడ్లుపై పరుగెత్తుతూ రాళ్లు వేశారు. దీంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లను ఉపయోగించి వారిని చెదరగొట్టారు. ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.

➡️