అప్రంటీస్ విధానం తగదు : టి.ఎన్.యు.ఎస్  

Feb 10,2024 14:46 #DSC Notification
tds on dsc candidates apprentice

ప్రజాశక్తి-అమరావతి : ఉపాధ్యాయ నియామకాలలో అప్రంటీస్ విధానం ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి 2012 డి ఎస్ సి నియామకాలు చేసారని టి.ఎన్.యు.ఎస్ తెలిపింది. ఇప్పుడు మరల ఆ అప్రంటీస్ విధానం తిరిగి తీసుకుని రావడం తగదని, ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు సవరించి అప్రంటీస్ విధానం అనే వెట్టి చాకిరీని తొలగించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, శ్రీరామ శెట్టి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో డిమాండ్ చేసారు.

➡️