- మంత్రి, అధికారులకు ఎమ్మెల్సీ లక్ష్మణరావు లేఖ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పాఠశాల విద్య ఉపాధ్యాయులు సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో విద్యా సంవత్సరం నుండి ముగిసే వరకూ పనిదినాల్లో ఏదో ఒక శిక్షణ పేరుతో ఉపాధ్యాయులను బడికి దూరం చేస్తున్నారని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. దీనిపై మంగళవారం నాడు మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్‌కూ వేర్వేరుగా లేఖలు రాశారు. 1990 నుండి నేటి వరకూ ప్రపంచ బ్యాంకు నుండి అప్పులు తెచ్చుకుని అవి పెట్టిన సంస్కరణల్లో భాగంగా, ప్రస్తుతం సాల్ట్ పథకంలో భాగంగా శిక్షణలు ఇస్తున్నారని తెలిపారు. డిఎస్‌సి లేకపోవడం ఒక సమస్య అయితే ఉన్న ఉపాధ్యాయులను బడికి దూరం చేయడం మరో సమస్య అని పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య ఎలా తగ్గుతుందో ఆలోచించాలని అంటూనే ఉపాధ్యాయులను తరగతి గదులకు దూరం చేస్తున్నారని అన్నారు. యాప్‌లో, బోధనేతర బాధ్యత లను రోజుల తరబడి చేయాల్సి వస్తోందని పేర్కొన్నా రు. దీనివల్ల బోధనాసమయం హరించుకుపో తోందని తెలిపారు. ఇదే పద్ధతి అనుసరిస్తే ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని అన్నారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకుని ఉపాధ్యాయ శిక్షణ నిలిపేయాలని కోరారు.