- యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి- పార్వతీపురం : ఫౌండేషన్ పాఠశాలలు, మోడల్ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటుకు ఉపాధ్యాయులనే మోటివేటర్లగా నియమించడం దారుణమని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఆయన పార్వతీరంలో యుటిఎఫ్ ముఖ్యనాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఫౌండేషన్ పాఠశాలలు, మోడల్ ప్రైమరీ సూళ్ల ఏర్పాటుకు, యుపి పాఠశాలల ఎత్తివేతకు పేరెంట్స్ కమిటీ, తల్లిదండ్రులను ఒప్పించాల్సిన బాధ్యతలు ఉపాధ్యాయులకే అప్పగించడం తగదన్నారు. ఈ చర్య ఉపాధ్యాయుల కళ్లను వారి చేతివేళ్లతో వాళ్లనే పొడుచుకోమన్నట్టు ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మురళీమోహనరావు మాట్లాడుతూ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఒక రోజు నిర్వహించాల్సి ఉండగా ఒక పూటతో ముగించడం వల్ల ప్రయోజనమేమీ ఉండదన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు తోట రమేష్, సహాధ్యక్షులు వి.జ్యోతి, కోశాధికారి కె.మురళి పాల్గొన్నారు.