హైదరాబాద్ :తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో విద్యాశాఖ మార్పులు చేసింది.. ఇకపై 100 మార్కుల పేపర్ ఉండనుంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులను ఎత్తివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్య – గ్రేడింగ్ విధానంలో ఇచ్చే మార్కులు పారదర్శకంగా ఉండటం లేదనే విమర్శలు వచ్చినందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గతంలో పదవ తరగతి పరీక్షల్లో 80 మార్కులకు పరీక్షలు నిర్వహించి, మరో 20 మార్కులకు ఇంటర్నల్ విధానాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.