తెలంగాణ : తెలంగాణలోని 27 జిల్లాలకు అధ్యక్షులను బిజెపి అధిష్ఠానం ప్రకటించింది. జనగామ – సౌడ రమేశ్, వరంగల్ – గంట రవి, హనుమకొండ – సంతోష్‌రెడ్డి, భూపాలపల్లి – నిశిధర్‌రెడ్డి, నల్గొండ-నాగం వర్షిత్ రెడ్డి, నిజామాబాద్ – దినేష్ కులాచారి, వనపర్తి- నారాయణ, హైదరాబాద్ సెంట్రల్ – దీపక్‌రెడ్డి, మేడ్చల్ రూరల్ – శ్రీనివాస్, ఆసిఫాబాద్- శ్రీశైలం ముదిరాజ్, కామారెడ్డి – నీలం చిన్నరాజులు, ములుగు – బలరాం, మహబూబ్‌నగర్ – శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల – యాదగిరిబాబు, మంచిర్యాల – వెంకటేశ్వర్లు గౌడ్, పెద్దపల్లి – సంజీవరెడ్డి, ఆదిలాబాద్ – బ్రహ్మానందరెడ్డి, సికింద్రాబాద్ – భరత్ గౌడ్. ………… పార్టీ బూత్, గ్రామ, మండల కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకున్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం జిల్లా కమిటీల అధ్యక్షుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు 25 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటింది. ఏకాభిప్రాయం కుదరని మరో 13 జిల్లాల అధ్యక్షుల నియామకాన్ని పెండింగ్‌లో పెట్టింది. పార్టీ పరంగా వ్యవహారాల కోసం మొత్తం 38 జిల్లాలుగా తెలంగాణను విభజించి అధ్యక్షుడిని ప్రకటించడం బీజేపీలో ఉంది. ఇక.. రాష్ట్రానికి కొత్త అధ్యకుడు వచ్చాక మిగతా జిల్లాల అధ్యక్షుల ఎంపిక ఉంటుంది. అన్నీ అనుకూలిస్తే వారంలోనే రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి వచ్చే అవకాశం ఉంది. ఇన్‌ఛార్జ్ శోభ కరంద్లాజే ముఖ్య నేతల అభిప్రాయం తీసుకున్నాక ఒకరిపేరు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఒకవేళ ఏకాభిప్రాయం రాకపోతే అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయి.
