తెలంగాణ : రైతు భరోసాపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేడు ఏడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ … ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పై మాట్లాడారు. రైతు సమాజాన్ని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ముందుంటుందన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. సాగులో లేని భూములకు వాళ్లు రైతు బంధు ఇచ్చారని ఆరోపించారు. రూ.22,600 కోట్లు దీని ద్వారా ఆయాచిత లబ్ధి చేశారని అన్నారు. రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తలకు కూడా రైతు బంధు ఇచ్చారని చెప్పారు. ” మనం రాళ్లకు, గుట్టలకు ఇద్దామా ? ” అని ప్రశ్నించారు. భూముల్లో రహదారి వెళ్తే దానికీ రైతుబంధు జమ చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు.
