తెలంగాణ బడ్జెట్‌ రూ.2.75 లక్షల కోట్లు – క్యాబినేట్‌ ఆమోదం

తెలంగాణ : తెలంగాణ బడ్జెట్‌ రూ.2.75 లక్షల కోట్లకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ భేటీ అసెంబ్లీ కమిటీ హాల్‌ లో శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. మండలిలో శ్రీధర్‌ బాబు బడ్జెట్‌ ను ప్రవేశ పెడతారు. లోక్‌ సభ ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్‌ ఎలా ఉండబోతోందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాగా బడ్జెట్‌ ప్రతిపాదనలతో భట్టి సమావేశంలో పాల్గొన్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనలపై చర్చ జరిగిన అనంతరం క్యాబినేట్‌ దానిని ఆమోదించింది. ఈనెల 12వ తేదీన బడ్జెట్‌ సమావేశాలను ముగించే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇరిగేషన్‌ పై శ్వేత పత్రం విడుదల చేయనున్నట్టు సమాచారం. విజిలెన్స్‌ ఇరిగేషన్‌ అంశాలను సభలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడనున్నారు.

➡️