తెలంగాణ కేబినెట్‌ సమావేశం

Feb 10,2024 09:58 #Begins, #cabinet meeting, #Telangana

తెలంగాణ : తెలంగాణ కేబినెట్‌ సమావేశం శనివారం ప్రారంభమై కొనసాగుతోంది. అసెంబ్లీ కమిటీహాల్‌ లో మంత్రివర్గం సమావేశమైంది. మంత్రి మండలి బడ్జెట్‌ను ఆమోదం తెలపనుంది. ఇరిగేషన్‌శాఖపై శ్వేతపత్రం, విజిలెన్స్‌ నివేదికపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఉభయసభల్లో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో డిప్యూటీ సిఎం భట్టి విక్కమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌ బాబు బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టనున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కెసిఆర్‌ తెలంగాణ అసెంబ్లీలో తొలిసారిగా సమావేశాలకు హాజరవుతున్నారు.

➡️