ఓటేసిన తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి

May 13,2024 12:33 #telangana cm revanth reddy, #voted

కొడంగల్‌ (తెలంగాణ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు కొడంగల్‌లోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. నల్గొండలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆర్టీసీ బస్సులో వెళ్లి ఓటు వేశారు. ములుగు జిల్లా జగ్గన్నపేటలో మంత్రి సీతక్క, ఖమ్మం జిల్లా మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గొల్లగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కల్లూరు మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి, సూర్యాపేట జిల్లా కోదాడలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఓటు వేశారు.

➡️