తెలంగాణ : ఈ నెల 15వ తేదీన కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సీఎల్పీ సమావేశం జరగనుంది. ఇందులో నాలుగు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. భూ భారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ-ఎస్టీ వర్గీకరణపై చర్చ ఉండనుంది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వ విప్‌లు సమాచారమిచ్చారు.
