Telangana : కుషాయిగూడ బస్‌ డిపోలో రెండు బస్సులు దగ్ధం

Feb 19,2025 11:52 #buses, #Telangana, #tpsrtc

మేడ్చల్‌ : తెలంగాణలోని మేడ్చల్‌ – మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ బస్‌ డిపోవద్ద ఆగి ఉన్న బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో రెండు టిపిఎస్‌ఆర్‌టిసి బస్సులు దగ్ధమయ్యాయని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. బస్సు ఇంజన్‌ వేడెక్కడం వల్ల మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఆగి ఉన్న మరో బస్సుకి అంటుకోవడంతో రెండు బస్సులు దగ్ధమయ్యాయని ప్రాథమిక విచారణలో తేలినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని అధికారులు మీడియాకు వెల్లడించారు.

➡️