నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

  • వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంపు

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న 44 ఏళ్ల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. పోలీస్‌ ఉద్యోగ నియామకాల వంటి యూనిఫామ్‌ సర్వీసులు మినహా మిగతా ఉద్యోగాలకు 46 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈమేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు. గ్రూప్‌ 1 సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచారు.

➡️