తెలంగాణ ఐసెట్‌ ‘కీ’ విడుదల.. సాయంత్రం వరకు అభ్యంతరాలు స్వీకరణ

Jun 9,2024 12:08 #Result, #ts icet exam

తెలంగాణ : తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహించిన ఐసెట్‌-2024 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్‌ కీని కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది. జవాబు కీతో పాటు, పరీక్ష ప్రశ్న పత్రాలు , అభ్యర్థుల ప్రతిస్పందన షీట్లు కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడ్డాయి. ప్రాథమిక కీపై ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత తుది కీతోపాటు ఫలితాలు ప్రకటిస్తారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://icet.tsche.ac.inవెబ్‌సైట్‌కి వెళ్లి పొందవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలుంటే జూన్‌ 09లోగా పంపాలని అధికారులు తెలిపారు.
ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
-తెలంగాణ ఐసెట్‌ పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://icet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
-హోమ్‌పేజీలో కనిపించే టిజి ఐసెట్‌ 2024 ప్రిలిమినరీ ప్రశ్నాపత్రాల ఎంపికపై క్లిక్‌ చేయండి.
-ఇక్కడ మీరు తేదీలతో పాటు సెషన్‌ వారీ వివరాలను కనుగొంటారు. మీరు ఏ సెషన్‌లో పరీక్ష రాశారు అనే లింక్‌పై క్లిక్‌ చేయాలి.
-ఇక్కడ ప్రిలిమినరీ కీ మీ కోసం తెరవబడుతుంది.
-ప్రింట్‌ లేదా డౌన్‌లోడ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయడం ద్వారా కాపీని పొందవచ్చు.

➡️