తెలంగాణ : తెలంగాణ సెక్రటేరియట్ వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్ 1 పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తూ … నేడు ఎఐఎస్‌ఎఫ్ నేతలు, నిరుద్యోగులు ‘చలో సెక్రటేరియట్’ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో …. నిరుద్యోగులు చేపట్టిన సెక్రటేరియట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. డిఎస్‌సి , గ్రూప్ – 2 పరీక్ష వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. సెక్రటేరియట్ ముట్టడి చేపట్టిన ఎఐఎస్‌ఎఫ్ నేతలను, విద్యార్థి సంఘాల నేతలను, నిరుద్యోగులను పోలీసులు బలవంతపు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
