తెలంగాణ : తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ … బుధవారం ఉదయం నాంపల్లిలోని గాంధీభవన్ ఎదుట ఉపాధ్యాయ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ప్లకార్డులను చేతపట్టి ఆందోళన చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్ధులకు ఈ నెల 9వ తేదీన నియామక పత్రాలు కూడా అందజేస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2024 డీఎస్సీ అభ్యర్ధుల నియామకం అయిన తర్వాత తమను సర్దుబాటు చేయడానికి ఖాళీలు ఉండబోవని ఉపాధ్యాయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో 317 జీవో బాధితులంతా నేడు ఛలో గాంధీభవన్ పేరిట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో… నేడు నాంపల్లిలోని గాంధీభవన్ ఎదుట ఉపాధ్యాయ ఉద్యోగులు ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 317 జీవో ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 317 జిఒ ను సమీక్షిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా తమ సమస్యను పరిష్కరించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 డీఎస్సీ అభ్యర్ధులు నియామకం అయిన తర్వాత తమను సర్ధుబాటు చేసేందుకు ఖాళీలు ఉండబోవని చెబుతున్నారు. అందుకే వారి నియామకాలకు ముందే తమను స్థానికత ఆధారంగా జిల్లాలకు పంపించాలని ఉపాధ్యాయ ఉద్యోగులు కోరుతున్నారు.