ఎంపిడిఒలకు తాత్కాలిక ఉద్యోగోన్నతులు

Apr 11,2025 20:47 #'coo' employees, #Temporary pause

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పంచాయతీరాజ్‌శాఖలోని ఆరుగురు ఎంపిడిఒలకు డిఎల్‌డిఒలుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్‌ అందించిన ప్రతిపాదనల ప్రకారం గుంటూరు జిల్లాకు చెందిన వై హనుమ రెడ్డి, కృష్ణా జిల్లాలో జి రాణి, జి అరుంధతి దేవి, తూర్పుగోదావరి జిల్లాలో ఎన్‌ బజ్జి, డి రాంబాబు, విజయనగరం జిల్లాలో ఎస్‌ రవీంద్రకు డిఎల్‌డిఒలుగా తాత్కాలిక ఉద్యోగోన్నతులు కల్పించారు. గతంలో కల్పించిన ఉద్యోగోన్నతుల సమయంలో వీరిపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన కేసులు పెండింగ్‌లో ఉండటంతో కల్పించలేదని, ప్రస్తుతం కేసులు ఎత్తివేయడంతో తాజాగా ఉద్యోగోన్నతులకు అవకాశం కల్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

➡️