మరో పది మంది విద్యార్థినులకు అస్వస్థత

ప్రజాశక్తి – శృంగవరపుకోట : విజయనగరం జిల్లా ఎస్‌.కోట ఎస్‌సి కళాశాల బాలికల వసతి గృహంలో మరో పది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థుల్లో అరుగురు అస్వస్థతకు గురి కావడంతో వారిని స్థానిక సిహెచ్‌సికి తరలించారు. బుధవారం మరో పదిమంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని కూడా సిహెచ్‌సికి తరలించారు. మొత్తం 16 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వసతి గృహంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం వసతి గృహంలో ఆహారం తయారీని పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడొద్దని.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. వసతి గృహంలో మొత్తం 180 మంది విద్యార్థినులు ఉన్నారు. కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

➡️