ముమ్మరంగా కొనసాగుతున్న ఓటింగ్

May 13,2024 12:43 #votes

 

వైసిపి ఏజెంట్‌పై కత్తితో దాడి
బోరకమందలో ముగ్గురు టిడిపి ఏజెంట్లు కిడ్నాప్
క్యూలో నిల్చుని వృద్ధురాలి మృతి
ప్రజాశక్తి-ఎలక్షన్‌ డెస్క్‌
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభమైంది. అంతకుముందు నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల ఎదుట బారులుతీరి ఉన్నారు. కొన్ని కేంద్రాల్లో నీడ సౌకర్యం కల్పించకపోవటంతో ఓటర్లు ఎండలో నుంచోవాల్సివచ్చింది. పలుచోట్ల ఇవిఎం మిషన్లు మొరాయించటంతో పోలింగ్‌ ఆలస్యమైంది. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం పరిధిలోని లంకలగన్నవరం గ్రామానికి చెందిన ఓటర్లు బోటుపై వెళ్లి కూడేరు పోలింగ్‌ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్వతీపురం మన్యంజిల్లా కొమరాడ మండలంలో నాగావళి నదిని దాటి రెబ్బ గ్రామస్తులు కూనేరు పోలింగ్‌ కేంద్రానికి ఓటు వేయటానికి వెళ్లారు. విజయవాడలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్ధుల్‌ నజీర్‌ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులలోని భాకారపురంలో 138వ పోలింగ్‌ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఉండవల్లిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరిలో జనసేన అధినేత కె.పవన్‌కల్యాణ్‌ ఓటు వేశారు. విజయవాడ గాంధీనగర్‌లోని సివిఆర్‌ స్కూలులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజమహేంద్రవరంలోని విఆర్‌పురంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు డి.పురంధరేశ్వరి ఓటుహక్కు వినియోగించుకున్నారు. హిందూపురంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ పోలింగ్‌బూత్‌లో అక్కడి టిడిపి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓటు వేశారు. చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాడు మండలం వైసిపి ఏజెంట్‌ సురేష్‌పై టిడిపి స్థానిక నాయకులు చంద్ర, సుబ్బయ్యనాయుడు కత్తితో దాడిచేశాడు. దాడికి పాల్పడిన ఇద్దరు టిడిపి నాయకులను అరెస్ట్‌చేసినట్లు చిత్తూరు అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు.చిత్తూరుజిల్లా పుంగనూరు నియోజకవర్గం చదువుమండలం బోరకమందలో టిడిపికి చెందిన ముగ్గురు ఏజెంట్లు కిడ్నాప్‌ అయినట్లుగా వచ్చిన ఆరోపణలపై జిల్లా ఎన్నికలు, పోలీస్‌ యంత్రాంగం స్పందించింది. కిడ్నాపైన టిడిపి ఏజెంట్లను పోలీసులు సీలేరులో గుర్తించి వారిని విధుల్లోకి హాజరపరిచినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌మీనా తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అచ్చంపేట పోలింగ్‌ కేంద్రం వద్ద వైసిపి, టిడిపి గ్రూపులు ఘర్షణ పడ్డాయి. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. తెనాలి ఎమ్మెల్యే దౌర్జన్యంసార్వత్రిక ఎన్నికలు కొనసాగుతోన్న వేళ తెనాలిలో అవాంఛనీయ ఘటన జరిగింది. ఉదయం నుండి క్యూలో నిలబడి వరుసగా ఓటు వేస్తున్న ఓటర్లను దాటుకుంటూ తెనాలిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ పోలింగ్‌ కేంద్రంలోకి నేరుగా వెళ్లారు. లైన్‌లో రాకుండా ఇలా నేరుగా వచ్చారేంటి అని సామాన్య ఓటరు ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే మండిపడ్డారు ఓటరు చెంపపై ఛెళ్లున కొట్టారు. అంతే స్పీడుతో ఆ ఓటరు ఎమ్మెల్యే చెంపపై కొట్టారు. ఇదంతా చూసిన ఎమ్మెల్యే అనుచరులు ఆ ఓటరుపై విరుచుకుపడ్డారు. మూకుమ్మడిగా దాడి చేశారు. పిడిగుద్దులు కొడుతూ బయటకు లాక్కెళ్లి విచక్షణారహితంగా కొట్టారు. ఈ దౌర్జన్యమంతా గుంటూరు జిల్లా తెనాలిలోని పోలింగ్‌ బూత్‌ లో జరిగింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.వఅద్ధురాలు మఅతి విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం తంగుడుబిల్లి పోలింగ్‌ బూత్‌ వద్ద పాలూరి పెంటమ్మ (65) ఓటు వేసేందుకు క్యూలైన్లో ఉండి ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూసింది. ఈ సంఘటనతో ఓటర్లంతా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. వెంటనే ఆమె మఅతదేహాన్ని అక్కడి నుండి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకు వెళ్ళిపోయారు.

➡️