కౌలు రైతు ఆత్మహత్య

Sep 10,2024 23:16 #Farmer, #palanadu, #suside

ప్రజాశక్తి – పిడుగురాళ్ల (పల్నాడు జిల్లా) : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కరాలపాడు గ్రామానికి చెందిన షేక్‌ మహ్మద్‌ (37) షేక్‌ మహ్మద్‌ గత కొన్నేళ్లుగా నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, మిరప, వరి సాగు చేస్తున్నారు. పంటల సాగు నిమిత్తం సుమారు రూ.12 లక్షల వరకు అప్పు చేశారు. ఏటికేడు వ్యవసాయంలో నష్టాలు రావడండో అప్పు తీర్చడం కష్టమైంది. పంటల దిగుబడి లేకపోవడం, రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. షేక్‌ మహ్మద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

➡️