రాజకీయ కక్షలతో కే.గంగవరంలో ఉద్రిక్తత

Jun 9,2024 10:47 #Konaseema, #Political violence

చెప్పుల దండలతో అంబేద్కర్ విగ్రహానికి అవమానం
ఎర్ర పోతవరం లాకులు వద్ద సంఘటన
దళితులు ఆందోళన పరిస్థితి ఉద్రిక్తం
పరిశీలించిన డి.ఎస్.పి సీఐ పోలీసులు

ప్రజాశక్తి-రామచంద్రపురం : ఎన్నికలు ముగిసిన వెంటనే రాజకీయ కక్షలుగుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని కే గంగవరం మండలంలో ఎర్ర పోతవరం గ్రామ శివారు గల లాకులు వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేసి అవమానించడమే కాకుండా, దళితులను స్థానిక సర్పంచ్ పిల్లి రాంబాబును ఉద్దేశించి అసభ్యకరమైన పదాలతో బూతులతో పోస్టర్లను అతికించారు. ఉదయం 7 గంటల సమయంలో దళిత యువకులుv దీనిని గమనించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దళితులు ఆగ్రహ జ్వాలలతో ఆందోళన చేపట్టి రోడ్డుపై బైఠాయించడంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు డిఎస్పి రామకృష్ణ, సిఐ దొరరాజు, ఎస్సైలు జానీ భాష, సురేంద్ర, తమ సిబ్బందితో వచ్చి దళిత యువకులకు నచ్చజె చెప్పారు ప్రస్తుతం సెక్షన్ 30 అమలులో ఉండటంవల్ల ఆందోళన కార్యక్రమాలు చేయకూడదని వారిచేత విరమింప చేశారు. అనంతరం లికిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. దీంతో దళిత నాయకులు దళిత యువకులు లిఖితపూర్వకంగా నేరస్తులను వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఉన్న చెప్పులు దండలు, అసభ్యకరమైన పోస్టర్లను తొలగించారు. అనంతరం బాబాసాహెబ్ పాలాభిషేకం నిర్వహించారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పేట్టా శ్రీనివాసరావు, రవ్వ భూషణం, సర్పంచ్ అంబటి తుకారం, మాజీ సర్పంచ్లు దున్న అన్నవరం, ఈరేల్ల రాజు, నాయుడు, విప్పర్తి బాబురావు, చెల్లె సూర్యారావు, పోతు వెంకట్రావు, సుధాకర్, దళిత యువకులు గ్రామస్తులు పరిసర ప్రాంతాల దళితులు అధిక సంఖ్యలో పాల్గొని, దోషులను కఠినంగా శిక్షించాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

దోషులను కఠినంగా శిక్షిస్తాం : డి.ఎస్.పి రామకృష్ణ

ఉద్రిక్తకంగా మారిన అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసిన సంఘటనపై వేగంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని రామచంద్రపురం డిఎస్పి బి.రామకృష్ణ, సీఐ పీ.దొర రాజులు విలేకరులకు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించామని, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ద్వారా, విచారణ వేగవంతంగా జరుపుతామని, దీంతోపాటుగా రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న సెల్ టవర్ల ద్వారా దోషులను గుర్తిస్తామని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని వీలైనంత త్వరగా దోషులను అరెస్ట్ చేస్తామన్నారు. అదేవిధంగా దళితులు యువకులు శాంతి ఈత వాతావరణం కొనసాగించాలని ఉద్రిక్తతలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిది కాదని దోషులను కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

 

➡️