TFPC : రేపు సినిమా షూటింగులు బంద్‌

తెలంగాణ : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. ఆయన మృతికి  సంతాప సూచకంగా ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపునిచ్చినట్లు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. రేపు సినిమా షూటింగులను నిలిపివేస్తున్నట్లు నిర్మాతల మండలి ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు ఫిల్మ్‌సిటీలో ఉన్న రామోజీరావు పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్నారు. ఇప్పటికే మోహన్‌బాబు, రాఘవేంద్రరావు, రాజమౌళి, కీరవాణి, శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి, నరేశ్‌, కల్యాణ్‌రామ్‌, సాయికుమార్‌ తదితరులు నివాళులర్పించారు.

➡️