హైదరాబాద్ : హైదరాబాదులో ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, టీజీ న్యాబ్ సంయుక్తంగా 25 పబ్బుల పై దాడులు నిర్వహించి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. పబ్బుల్లో 107 డ్రగ్ డిటెక్షన్ కిట్లతో తనిఖీలు నిర్వహించగా ఐదుగురికి (పాజిటివ్), డ్రగ్స్ తీసుకున్నట్లు వెళ్లడయ్యింది. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున ఒంటిగంట వరకు తనిఖీలు నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి దాడుల్లో ఎక్సోరా లో గంజాయి, టెస్టుల్లో ఇద్దరికీ పాజిటివ్ ఉన్నట్లు వెల్లడయింది. రంగారెడ్డిలో నిర్వహించినటువంటి బార్లలో మరో 3 ముగ్గురు వ్యక్తులు డ్రగ్ టెస్టింగ్ లో బయటపడింది. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి, జాయింట్ కమిషనర్ ఖురేషి,. అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి ఆర్ కిషన్, తోపాటు టిజీ ల్యాబ్ నుంచి సీఐ రాజశేఖర్ ఎస్‌ఐలు వెంకట్, వెంకటరమణ సంతోష్ కుమార్,ఇతరులు పాల్గొన్నారు.
