TTD: ‘ఆ’ వార్త పూర్తిగా అవాస్తవం

Jan 8,2025 10:42 #Fake News, #Tirumala

తిరుమల : గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రజా సంబంధాల అధికారిణిగా పని చేసిన నిష్కా బేగం ఇంటిపై ఈడీ దాడులు చేసిందనీ, ఆ నగలను స్వాధీనం చేసుకున్నట్టు కొన్ని ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీటీడీ పేర్కొంది. టీటీడీలో అటువంటి వ్యక్తి ప్రజా సంబంధాల అధికారిగా ఎప్పుడూ లేరని తెలిపింది. అంతే కాకుండా సదరు పోస్టులో గతంలో ఎక్కడో జరిగిన ఫోటోలను జతపరచి టీటీడీ పేరును వాడడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. భక్తులను తప్పుదోవ పట్టించి వారి మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఇటువంటి అవాస్తవ వార్తలు ప్రచారం చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటుందని టీటీడీ మరొకసారి హెచ్చరించింది.

➡️