- ఢిల్లీలో ఆయన కారును ఢీకొట్టిన మరో కారు
ప్రజాశక్తి -భీమవరం : కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలో లోక్‌సభ సమావేశాలనంతరం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వెళ్తుండగా విజయ్ చౌక్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వర్మ కాలికి తీవ్ర గాయమైంది. కేంద్ర మంత్రి కార్యాలయ వైద్య బృందం ప్రత్యేక చికిత్స అందించారు. కాలికి బలమైన గాయం కావడం వల్ల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో గురువారం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాల్సి ఉన్నందున ఢిల్లీ నుంచి భీమవరానికి వచ్చారు.