వడ్ల కొనుగోళ్ల జాప్యంపై అన్నదాతల ఆగ్రహం

May 15,2024 12:45 #Dharna, #formers

యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్‌ పాలనలో రైతుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి, అప్పులు చేసి పంటలు పండిస్తే ప్రభుత్వం కోనుగోలు చేయకపోవడంతో రైతన్నలు ఆగ్రహం చెందారు. కండ్ల ముందే పంటలు పాడవుతున్నా పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు కలెక్టరేట్‌ ఎదుట గిరిజన రైతుల ధర్నా చేపట్టారు.
ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. జిల్లాలోని భువనగిరి మండలం పచ్చళ్లపాడు తండా గ్రామానికి చెందిన గిరిజన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వడ్లు కొనకపోతే ఉద్యమాన్ని ఉద్రుతం చేస్తామని హెచ్చరించారు.

➡️