కాసేపట్లో టిడిపి అభ్యర్థుల మూడో జాబితా ప్రకటన

అమరావతి : కాసేపట్లో అభ్యర్థుల మూడో జాబితాను టిడిపి ప్రకటించనుంది. జనసేన, బిజెపితో సీట్లను టిడిపి అధినేత చంద్రబాబు ఖరారు చేసుకున్న నేపథ్యంలో … పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో టిడిపి బరిలో దిగనుంది. ఇప్పటికే 128 శాసన సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న 16 అసెంబ్లీ స్థానాలతోపాటు 17 లోక్‌సభ అభ్యర్థులను ఈరోజు వెల్లడించనున్నారు.

➡️