– సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కరయ్య
– ఆహ్వాన సంఘం కరపత్రం ఆవిష్కరణ
ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం (ఎన్‌టిఆర్ జిల్లా) : రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారని ఎపి రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య తెలిపారు. టిడిపి కూటమి ప్రభుత్వం రజక వృత్తిదారులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌టిఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలోని క్రాంతి హైస్కూల్‌లో ఎపి రజక వృత్తిదారుల సంఘం 7వ రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం కరపత్రాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారులు, కార్మికులు, ఉద్యోగులు, యువకులు, మహిళల ఎదుర్కొంటున్న సమస్యలను ఈ మహాసభలో చర్చించి రాబోయే కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందించేందుకు డాక్టర్ ఎన్‌టిటిపిఎస్ బి కాలనీ ఆడిటోరియం గ్రౌండ్‌లో ఏప్రిల్ 20, 21 తేదీల్లో మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రజకులందరూ పాల్గని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు బోలియ శెట్టి శ్రీకాంత్, ఆహ్వాన సంఘం అధ్యక్షులు చిక్కవరపు వెంకట రెడ్డయ్య, ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య, సంఘం రాష్ట్ర కోశాధికారి వల్లభాపురం వెంకటేశ్వరరావు, ఆహ్వాన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లూరు శ్రీనివాసరావు, బండారు వెంకట శివరామకఅష్ణ, తదితరులు పాల్గన్నారు.
