ముగ్గురు నకిలీ టీసీల దందా … చివరికి..!

Nov 29,2023 11:54 #arrest, #fake, #TCs, #Three

చీరాల (బాపట్ల) : చీరాలలో ముగ్గురు నకిలీ టీసీలను జి ఆర్‌ పి పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. బుధవారం ఉదయం పోలీసులు దీనిపై వివరణ ఇచ్చారు. ముగ్గురు నకిలీ టీసీలు కొద్దిరోజులుగా టీసీల యూనిఫామ్‌ ధరించి రైళ్లలో టికెట్లను చెక్‌ చేస్తూ అవి లేని అమాయకుల నుండి అందినంత దండుకుంటున్నారని తెలిపారు. మంగళవారం చీరాల రైల్వే టి.సి రాజేష్‌ కు ఆ నకిలీ టీసీలు తారసపడ్డారు. వెంటనే వారిని గుర్తించి విచారణ చేపట్టారు. ఆ ముగ్గురూ నకిలీలని నిర్ధారించుకొని జిఆర్పీ పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్‌ఐ కొండయ్య బుధవారం తెలిపారు.

➡️