- సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జెకె మహేశ్వరి
ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : విశాఖపట్నం అందాలు వర్ణనాతీతమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జెకె మహేశ్వరి అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం కైలాసగిరి, తెలుగు మ్యూజియం ప్రాంతాలను సందర్శించారు. సెల్ఫీ పాయింట్ వద్ద నిల్చొని సెల్ఫీ తీసుకున్న ఆయన కైలాసగిరి కొండపై నుంచి విశాఖ అందాలను ఆస్వాధించారు. కుటుంబ సభ్యులందరితో కలిసి అద్దాల ట్రైన్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు రోజుల విశాఖ పర్యటనలో ఎన్నో మధుర స్మృతులను పొందానని తెలిపారు. ప్రకృతి సోయగాలకు, సహజసిద్ధమైన అందాలకు విశాఖపట్నం చిరునామాగా నిలుస్తుందని పేర్కొన్నారు.. తెలుగు మ్యూజియంను సందర్శించి అక్కడి విశిష్టతలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట విఎంఆర్‌డిఎ జాయింట్ కమిషనర్ రవీంద్ర, మార్కెటింగ్ శాఖ ఎడి యాసిన్, స్థానిక తహశీల్దార్ పాల్ కిరణ్ తదితరులు ఉన్నారు.