- కొత్త రంగులతో యూనిఫారం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే యూనిఫారం దుస్తుల రంగు మారనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త రంగులతో విద్యాశాఖ అందించనుంది. ఇందుకు సంబంధించిన డిజైన్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఖరారు చేశారు. సిమెంట్ కలర్ ప్యాంట్, లైట్ బిస్కెట్ కలర్‌పై చెక్స్ ఉన్న చొక్కాతో యూనిఫారం అందించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.