అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారులు మరికాసేపట్లో విడుదల చేయనున్నారు. ఎపి వ్యాప్తంగా 175 శాసనసభ నియోజకవర్గాల మొత్తం 4,210 నామినేషన్లు, 25 లోక్‌సభ నియోజక వర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో 17 ఎంపి స్థానాలకు 625 నామినేషన్లు వచ్చాయి. ఇరు రాష్ట్రాల్లో మే 13 న పోలింగ్ జరగనుంది. జూన్ 4 ఫలితాలు వెల్లడించనున్నారు.
