YCP office: కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదు : అంబటి

Jun 22,2024 12:54 #ambati rambabu, #ofice, #Tadepalli, #YCP

ప్రజాశక్తి-తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసిపి కార్యలయం కూల్చివేత రాజకీయ కక్ష సాధింపు చర్యేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కూల్చిన పార్టీ ఆఫీసును మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, హనుమంతరావు, మాజీ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్‌ మందపాటి శేషగిరి, స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కక్షసాధింపు చర్యలు చేపట్టిందని విమర్శించారు. ఏ ప్రభుత్వం అయిన వారి పార్టీ కార్యాలయాలకు స్థలం కేటాయింపు చేసుకోవచ్చనే నిబంధనలు అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలోనే అమలు చేశారని తెలిపారు. గత ప్రభుత్వ హాయంలో మంగళగిరిలో టీడీపీ రాష్ట్ర కార్యలయం ఏర్పాటు చేసిందని.. దానిలో వాగు పోరంబోకు ఉందనే విషయంపై కోర్టులో కేసు నడుస్తున్నాయని ఆరోపించారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చారా లేక కక్షసాధింపు చర్యలు చేయడానికేనా అంటు ప్రశ్నించారు. ఆఫీసు నిర్మాణం కోసం కేబినెట్‌ ఆమోదం పొందాకే స్థలాన్ని తీసుకున్నామని తెలిపారు. నాడు ప్రజా వేదిక కుల్చినప్పుడు కక్షసాధింపు అన్నారు. నేడు పోలీసులను అడ్డంపెట్టుకుని నిర్మాణ దశలో ఉన్న భవనం కూల్చివేత దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు. అధికారం ఏవరికి శాశ్వతం కాదనే విషయం మీకు తెలిసిన విషయమే. కాని ఇలా కక్షసాధింపు చర్యలు సబబు కాదనే విషయం పరిగణలో ఉంచుకోవాలని హితవు పలికారు. ఏది ఏమైనా ఇది ముమ్మాటికీ కక్షసాధింపని, అటవిక చర్యని దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తామన్నారు.

➡️