కారులో మంటలు .. తృటిలో తప్పిన ప్రమాదం

Feb 4,2025 16:52 #car, #fire, #hyderabad

హైదరాబాద్‌ :   వేసవికాలం రాకముందే వాహనాల్లో మంటలు చెలరేగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కారు మంటలు చెలరేగిన ఘటన నుండి మంగళవారం నలుగరు ఉద్యోగులు తృటిలో తప్పించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం నలుగురు ప్రైవేట్‌ ఉద్యోగులు రాయదుర్గం నుండి కొమరవెల్లికి బయలుదేరారు. వరంగల్‌ జాతీయ రహదారి పోచారం ఐటి కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే కారు నుండి దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

➡️