నెల్లూరు : సిపిఎం 27వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభ సందర్భంగా ప్రతినిధుల సభ వేదికను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. భారీ ఎల్‌ఇడి స్క్రీన్లు ఆకర్షణగా ఉన్నాయి. పుచ్చపల్లి సుందరయ్య, జక్కా వెంకయ్య నిలువెత్తు ప్లెక్సీలతోపాటు, సీతారాం ఏచూరి చిత్రం స్క్రీన్‌పై ఉండేలా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇఎంఎస్ నంబూద్రిపాద్, బుద్దదేవ్ భట్టాచార్య, ఫొటోలు పెట్టారు. ప్రతినిధుల సభ వద్ద కేరళ తరహా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వాగత ద్వారాల వద్ద అటు,, ఇటు జాతీయ, రాష్ట్ర నాయకుల చిత్రపటాలు ఏర్పాటు చేశారు.
ప్రసంగిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
ప్రసంగిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
ఇటీవల కాలంలో వివిధ ప్రజా ఉద్యమాల్లో, అనారోగ్య కారణాలు, ప్రమాదాల్లో మరణించిన వారికి నివాళి అర్పించిన మహాసభ
ప్రారంభ సభకు అధ్యక్షత వహిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎంఎ గఫూర్
ప్రారంభ సభలో ప్రసంగిస్తున్న సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు ఎంఎ బేబి..
ఆకర్షణీయంగా ఎర్ర జెండా వీరుల ఫోటో గ్యాలరీ…
స్పూర్తి నింపిన అమరవీరుల స్తూపం
ఆకట్టుకున్న ప్రతినిధుల ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన మహాసభ ధర్మాకోల్ బ్యానర్..
పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ్ పరిహారం కోసం కూనవరం మండలం నుంచి నెల్లూరుకు చేరి, పతాక జెండాను పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులుకు అందిస్తున్న జాత బృందం..
ఎర్ర పూల తోటలా ప్రాంగణం
ఉత్సాహభరితంగా కళాకారుల విప్లవ గీతాలు
పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సిపిఎం రాష్ట్ర నాయకత్వం….
రాజధాని అమరావతిని చట్టబద్ధం చేసి కేంద్రప్రభుత్వం నిధులివ్వాలని, ప్రత్యేకహోదా, విభజన హామీలు అమలు చేయాలని, రాజధాని రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తాడేపల్లి నుంచి నెల్లూరుకు చేరిన జాత
కడప ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే నిర్మాణం చేయాలని జమ్మలమడుగు నుంచి నెల్లూరుకు వచ్చిన జాత
32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖస్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నం నుంచి నెల్లూరుకు చేరిన జాత
సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ సందర్భంగా ప్రజలెదుర్కొంటున్న 5 ప్రధాన సమస్యలపై రాష్ట్రంలోని ఐదుచోట్ల నుంచి పతాక యాత్రలు
అమరవీరుల స్తూపంపై శ్రామికుల రూపం తీర్చిదిద్దిన కళాకారుడు…
ప్రతినిధుల రిజిస్ట్రేషన్ ప్రారంభం