అసెంబ్లీ ఫైనాన్స్‌ కమిటీలకు ఛైర్మన్ల నియామకం

Feb 4,2025 23:12 #ap assembly
  • స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర శాసన వ్యవస్థలో మూడు ఫైనాన్స్‌ కమిటీలకు ఛైర్మన్ల నియామకం పూర్తయినట్లు శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ లెక్కల సమితి (పిఎసి) ఛైర్మన్‌గా రామాంజనేయులు పులివర్తి, ప్రభుత్వ రంగ సంస్థల సమితి (పియుసి) ఛైర్మన్‌గా కూన రవికుమార్‌, అంచనాల సమితి (ఇసి) ఛైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరరావును నియమించినట్లు తెలిపారు. రాష్ట్ర శాసనసభలోని 175 మంది సభ్యుల నుంచి 9 మంది, రాష్ట్ర శాసనపరిషత్తు 58 మంది సభ్యుల నుంచి ముగ్గురు చొప్పున ఆయా కమిటీల్లో సభ్యులుగా ఎన్నికయ్యారు.

➡️