పర్యాటకాభివృద్ధి సంస్థ తీరుపై హైకోర్టు ఆగ్రహం

ప్రజాశక్తి-అమరావతి : తిరుమలలో క్యాంటీన్లను నిర్వహించకుండా సబ్‌ లీజుకు ఎందుకు ఇచ్చారని పర్యాటకాభివృద్ధి సంస్థను హైకోర్టు ప్రశ్నించింది. తిరుమలలో క్యాంటీన్‌ నిర్వహణకు టిటిడి అనుమతులిస్తే, ఆ క్యాంటీన్‌ను మరొకరికి సబ్‌ లీజుకు ఇవ్వడానికి ఎపిటిడిసి టెండర్లు పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని ఎపిటిడిసిని ఆదేశించింది. విచారణను సెప్టెంబరు 4కు వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తిరుమలలో క్యాంటీన్‌ నడుపుకునేందుకు టిటిడి నుంచి అనుమతి పొందిన ఎపిటిడిపి ఆ తర్వాత సబ్‌ లీజుకు టెండర్లు పిలవడాన్ని హైదరాబాద్‌కు చెందిన సురవరం ప్రతాప్‌రెడ్డి పిల్‌ దాఖలు చేశారు. సబ్‌ లీజ్‌కు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని న్యాయవాది పిఆర్‌కె అమరేంద్ర కుమార్‌ తెలిపారు.

➡️