ప్రజాశక్తి-అమరావతి : తమ గ్రామ పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికల్లో రాజకీయ జోక్యానికి ఆస్కారం లేకుండా ఎన్నికలను రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని కోరుతూ లద్దగిరి గ్రామస్తుడు షేక్ మహబూబ్ బాషా హైకోర్టులో అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశా రు. జస్టిస్ రాజశేఖరరావు ఎదుట జరిగిన విచారణ సమయంలో పిటిషనర్ అడ్వకేట్ పి.శివప్రసాద్ వాదనలు వినిపిస్తూ, ఓటర్ల భద్రత కోసం ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలన్న వినతిపత్రాలను అధికారులు పట్టించుకోవడంలేదని తెలిపారు. వాదనల తర్వాత హైకోర్టు స్పందిస్తూ.. పిటిషనర్ ఆందోళన ఆధా రంగా స్పందించడం కష్టమేనని, ఆందోళనలతో దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హత లేదని పేర్కొంది. అయినప్పటికీ, ఎన్నిక లు ప్రజాస్వామ్యయుతంగా ఉండాలన్న సంకల్పంతో పిటిషనర్ కోరిన విధంగా లద్దగిరి పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికలను బ్యాలెట్ ద్వారానే నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.
