క్షమాపణ చెప్పినంత మాత్రాన… పోయిన ప్రాణాలు తిరిగి రావు : టిటిడి ఛైర్మన్‌

ప్రజాశక్తి – తిరుమల: ‘తొక్కిసలాట ఘటనపై క్షమాపణ చెప్పడంలో తప్పులేదు.. అయితే క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి రావు..’ అని టిటిడి చైర్మన్‌ బిఆర్‌ నాయుడు అన్నారు. తప్పిదం జరిగిందని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామ న్నారు. శుక్రవారం సాయంత్రం టిటిడి పాలకమండలి అత్యవసర సమావేశం జరిగింది. తొలుత భక్తుల మృతికి సంతాపం తెలియజేశారు. తొక్కిసలాట ఘటనపై సిఎం ఆదేశాలపై అజెండాగా చర్చించారు. అనంతరం మీడియాతో చైర్మన్‌ మాట్లాడుతూ.. ఘటనపై న్యాయ విచారణకు సిఎం ఆదేశించారని, నివేదిక వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆరుగురికి పరిహారాన్ని శనివారం బాధితుల ఇళ్లకు వెళ్లి అందిస్తామని తెలిపారు. మృతుల కుటుంబంలోని విద్యార్థులకు విద్యావ కాశం, కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు.

➡️