సాగర్‌ టు శ్రీశైలం లాంచీ ప్రయాణం..  రెండేళ్ల తర్వాత కదిలిన పడవ

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : రెండేళ్ల తర్వాత నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది. శనివారం ఉదయం పది గంటలకు 40 మంది ప్రయాణికులతో బయల్దేరిన లాంచీని నందికొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తిరుమలకొండ అన్నపూర్ణ జెండా ఊపి ప్రారంభించారు. సాయంత్రం నాలుగు గంటలకు లాంచీ శ్రీశైలం చేరుకుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు తిరిగి శ్రీశైలం నుంచి బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు నాగార్జునసాగర్‌ చేరుకోనుంది. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. దానిలో భాగంగా టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల నాగార్జునసాగర్‌ను సందర్శించి పరిశీలించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నర్సింహ, లాంచీ యూనిట్‌ మేనేజర్‌ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️