హైదరాబాద్ : రియల్టర్ కృష్ణ హత్య కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కమ్మరి కృష్ణ కొడుకుల హస్తం ఉందా అనే సమాచారాన్ని కాప్స్ కూపి లాగుతున్నారు. గతంలో కన్న కొడుకులను చంపడానికి కమ్మరి కృష్ణ సుపారి ఇచ్చినట్లు సమాచారం. త్రుటిలో ఇద్దరు కొడుకులు ప్రాణాలతో బయట పడ్డారు. 30 సంవత్సరాల వయసు ఉన్న కొడుకులు ఉండగా రెండోవివాహం చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి కమ్మరి కృష్ణ పై కొడుకులు పగ పెంచుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పధకం ప్రకారం మర్డర్ చేసినట్లు గుర్తించారు. ఇందులో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందని దానిపై సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా.. వివాదాస్పద భూములను కొనుగోలు చేయడమే కృష్ణ నైజంగా కుటుంబ సభ్యులు తెలిపారు. అందులో భాగంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రియల్టర్ కృష్ణ ది సుపారి హత్యగానే కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ గొడవలో భాగంగానే బాబా శివానంద్ కు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాన్నను హత్య చేశారన్న విషయం తెలియగానే షాక్‌కు గురయ్యా అని కుమారుడు శివ తెలిపాడు. నాన్నను ఎందుకు చంపారనేది అసలేమి అర్థం కావడం లేదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గొడవలు జరగడం సహజమని, నాన్నకు ప్రాణహాని ఉందని తెలియదని కుమారుడు శివ పేర్కొన్నాడు. ఇక మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణ కేసులో నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. భార్య ఎదుట హత్యచేసిన బాబా శివానంద అతని ఇద్దరు అనుచరులు సతీష్, జగదీష్ శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. దీంతో షాద్ నగర్ పిఎస్ లో శంషాబాద్ పోలీసులు నిందితులను అప్పగించారు. నిందితులు రాజేంద్రనగర్ కిస్మత్పూర్ డిఫెన్స్ కాలనీ కి చెందిన వారిగా గుర్తించారు. ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
