ప్రజాశక్తి-నెల్లూరు: నెల్లూరు నగరంలో ప్రజాశక్తి బుక్ హౌస్ వారు మార్చి 15-23 వరకు వారం రోజుల పాటు పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నారు.
ఈ పుస్తక మహోత్సవాన్ని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు వాసులకు పుస్తకాల మీద ఉన్న ఆసక్తిని ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ప్రజాశక్తి వారు అనేక పబ్లిషర్స్ కి సంబందించిన పుస్తకాలను అందుబాటులో ఉంచారని అన్ని వర్గాల ప్రజల కోసం ఈ పుస్తక ప్రదర్శన అంటుబాటులో తీసుకువచ్చిన నిర్వహకులను అభినందించారు. నెమ్మి నీలం అనే శీర్షిక గల పుస్తకం యొక్క విశిష్టతను తెలియచేస్తూ అందరు ఆ పుస్తకం చదవాలని సూచించారు. వారం రోజులు పాటు జరిగే ఈ పుస్తక మహోత్సవాన్ని అవకాశాన్ని యువత, నగర ప్రజలు అందిపుచ్చుకోవాలని సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి మేనేజర్ కొండ్రు కోటేశ్వరరావు, బుక్ హౌస్ ఇన్చార్జ్ కె. అరుణ, సిఐటియు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి నరసింహ తదితరులు పాల్గొన్నారు.
