ముంబయి : నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్‌ఎస్‌ఇ) 2025 ఏప్రిల్‌లో మరో మైలురాయిని అధిగమించినట్లు తెలిపింది. యూనిక్ క్లయింట్ కోడ్‌లు, ఖాతాలు 22 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. 2024 అక్టోబర్ 20 నాటికి 20 కోట్లుగా ఉన్న సంఖ్య.. ఆరు నెలల్లోనే భారీగా పెరిగిందని పేర్కొంది. మహారాష్ట్ర, యుపి, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు 49 శాతం వాటా కలిగి ఉన్నాయని ఎన్‌ఎస్‌ఇ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ పేర్కొన్నారు. దేశంలో ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందన్నారు.
