బోల్తాపడిన వాహనం – కొబ్బరికాయలను ఎత్తుకెళ్లిన జనాలు

వర్థన్నపేట (వరంగల్‌) : కొబ్బరికాయల లోడుతో వెళుతున్న లారీ బోల్తాపడింది… అంటే అక్కడున్న స్థానికులంతా చేరి ఆ కొబ్బరికాయలను సంచుల్లో నింపుకొని పట్టుకుపోయారు.. ఈ ఘటన మంగళవారం వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట వద్ద జరిగింది. కొబ్బరికాయల లోడుతో వెళుతున్న ఈ బలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో రోడ్డుపక్కనే పడిపోయిన కొబ్బరికాయలను సమీపంలో ఉన్న తండావాసులు, స్థానికులు వచ్చి సంచుల్లో నింపుకొని ఎత్తుకెళ్లారు.

➡️