ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి శనివారం ఓ విమానం చక్కర్లు కొట్టింది. ‘నో ఫ్లై జోన్’ ఏరియాగా తిరుమల ఉన్నప్పటికీ తరుచూ విమానాలు చక్కలు కొడుతూనే ఉన్నాయి. ఈ విషయంపై టిటిడి యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆగమ శాస్త్ర సాంప్రదాయ నిర్వాహకులు మండిపడుతున్నారు. శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వానికి టీటీడీ పలుమార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
