పులివర్తి నానికి భద్రత హైకోర్టుకు తెలిపిన పోలీసులు

May 16,2024 21:24 #AP High Court, #Pulivarthi Nani

ప్రజాశక్తి-అమరావతి : చంద్రగిరి శాసనసభ టిడిపి అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయనకు భద్రత కల్పించినట్లు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. అదే విధంగా దాడి చేసిన వారిని అరెస్టు చేసినట్లు వివరించారు. నిందితులను కోర్టు ద్వారా రిమాండ్‌కు పంపినట్లు ఎజిపి నిర్మల్‌ కుమార్‌ తెలిపారు. నానికి, ఆయన భార్య కుమారుడుకు భద్రత కల్పించామని, నాని ఇంటి వద్ద పికెట్‌ కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వివరాలను సమర్పించేందుకు గడువు కావాలని కోరడంతో విచారణను ఈ నెల 24కు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి గురువారం ప్రకటించారు. తమకు భద్రత కల్పించాలంటూ పులివర్తి నాని, ఆయన భార్య, కుమారుడు వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.

➡️