ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : నూతన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిని బుధవారం అధికారులు ప్రకటించారు. సవరించిన డివిజన్ల ప్రకారం పలాస, విశాఖపట్నం, దువ్వాడ, కూనేరు – విజయనగరం, నౌపాడ జంక్షన్, పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్, సాలూరు, సింహాచలం ఉత్తర, దువ్వాడ బైపాస్, వడ్లపూడి దువ్వాడ, విశాఖ ఉక్కు కర్మాగారం, జగ్గయ్యపాలెంతో కూడిన సుమారు 410 కిలోమీటర్ల పరిధిగల ప్రాంతాన్ని న్యూ సౌత్ కోస్ట్ రైల్వే కింద వాల్తేరు డివిజన్‌గా ఉంచుతారు. దీని పేరును విశాఖ డివిజన్‌గా మార్చనున్నారు. అదేవిధంగా వాల్తేరు డివిజన్‌లోని మరో భాగమైన కొత్తవలస – బచేలి / కిరండూల్, కూనేరు – తేరువలి జంక్షన్, సింగాపూర్ రోడ్, అరకు, కోరాపుట్ జంక్షన్, పర్లాఖిముడి – గన్‌పూర్ స్టేషన్ల మధ్యనున్న సుమారు 680 కిలోమీటర్ల పరిధిలోని భాగాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని రాయగడలో హెడ్ క్వార్టర్‌తో కలిపారు. ఇదిలా ఉండగా విశాఖ రైల్వే డివిజన్‌లోనే కెకె.లైన్‌ను కొనసాగించాలని సిపిఎం డిమాండ్ చేసింది.
