నిజామాబాద్ : పొలంలోని వరికొయ్యలు ఓ రైతు ప్రాణాలను తీసింది. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం పోతునూరులో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద వాల్గోట్ గ్రామానికి చెందిన కిషన్ అనే రైతు పోతునూరులో గల వ్యవసాయ భూమిలో వరి కొయ్యలు కాల్చేందుకు నిప్పు పెట్టాడు.
ప్రమాదవ శాత్తు కిషన్ మంటల మధ్యలో చిక్కుకొని ఊపిరాడక మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిషన్ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
