డ్రగ్స్‌ కేసులో ఉన్నారని బెదిరింపులు.. మహిళా ఉద్యోగి నుంచి రూ.32 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

Jul 5,2024 12:02 #Cyber Crimes, #Vijayawada
cyber crimes in india

విజయవాడ: సైబ ర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. బ్యాంకు వివరాలు, ఫోన్‌ నంబ ర్‌, పిన్‌ నంబ ర్‌లు రాబ ట్టి అందానికాడికి డబ్బులు దండుకోవడమే కాదు.. కొన్నిసార్లు మాయమాటలు, బెదిరింపులతో కూడా డబ్బులు కొట్టేస్తున్నారు.. తాజాగా, విజయవాడ పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది.. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. మాదక ద్రావ్యాల కేసులో ఉన్నారంటూ బెదిరించి.. ఓ మహిళా ఉద్యోగి నుంచి రూ. 32 లక్షలు సైబ ర్‌ నేరగాళ్లు కొట్టేశారు . బాధితురాలు విజయవాడ భవానీపురానికి చెందిన మహిళా ఉద్యోగి.. రెండు దఫాలుగా  32 లక్షలు సైబ ర్‌ నేరగాళ్లు చెప్పిన అకౌంట్‌లో వేశారు .  మీ పేరుతో కొరియర్‌ వచ్చిందని.. అందులో మాదాక ద్రావ్యాలు, పాస్‌ పోర్ట్‌, 35 వేలు నగదు ఉన్నాయని సైబ ర్‌ నేరగాళ్ల ఫోన్ చేశారు.. ముంబై నుంచి సైబ ర్‌ సీఐ మాట్లాడుతున్నట్టు మహిళకు పదే పదే ఫోన్ చేయటంతో భయపడి ఆమె.. రూ.32 లక్షలు వారు చెప్పిన ఖాతాలో వేశారు.. ఆ తర్వాత ఇదంతా పేక్‌ అని గుర్తించిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు కేసు నమోదు చేసి దార్యాప్తు చేపట్టారు . ఇలా పలు రకాలుగా మోసాలకు తెరలేపుతూ.. అందినకాడికి దండుకుంటున్నారు కేటుగాళ్లు. వారితో జాగ్రత్తగా ఉండాలని.. ఆన్‌లైన్‌లో ఎవరిని పడితే వారిని నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

➡️