బీఫార్మసీ విద్యార్థిని ఢీ కొట్టిన స్కూల్‌ బస్సు సీజ్‌.. డ్రైవర్‌ అరెస్ట్‌

Aug 21,2024 13:30 #arrested, #driver, #school bus, #seized

హైదరాబాద్‌ : బీఫార్మసీ విద్యార్థిని హారికను ఢీ కొట్టిన స్కూల్‌ బస్సును పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసి రంగారెడ్డి స్కూల్‌ బస్సును రాజేంద్రనగర్‌ పోలీసులు సీజ్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే..అత్తాపూర్‌ రెడ్డి బస్తీకి చెందిన హారిక పిల్లర్‌ నెంబర్‌ 130 వద్ద మంగళవారం ఉదయం రోడ్డు దాటుతుండగా ఓ పాఠశాలకు చెందిన బస్సు అమెను ఢీ కొట్టింది. ఈ ఘటనలో అమె కింద పడి తీవ్ర గాయాల పాలైయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అమెను స్థానిక హాస్పిటల్‌లో చేర్చించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం హారిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

➡️